రైతులు ధాన్యాన్ని తమకు నచ్చిన రైస్ మిల్లుకు అమ్ముకొవచ్చు

అత్తిలిమండలంలో దంతుపల్లి, ఉనికిలి గ్రామాలలో బుధవారం జరిగిన పొలంపిలుస్తుంది కార్యక్రమంలో అత్తిలి మండల వ్యవసాయ అధికారి టి.రాజేష్ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రైతులు తమకు నచ్చిన మిల్లుకి ధాన్యం పంపుటకు వెసులుబాటు కలదని మరియు రైతులు రైతు సేవా కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి తమ ధాన్యానికి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం,దానికి అనుగుణంగా అత్తిలి మండలంలో 20  రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు అన్నీ ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉన్నాయి. రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతులు నగడు జమచేయబడుతుందని తెలియజేయడమైనది. ధాన్యం కొనుగోలు చేయుటకు ప్రతి కొనుగోలు కేంద్రంలో TA,DEO,HELPAR అందుబాటులో ఉంటారని తెలియజేయదమైనది. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నందు గోనెసంచులు ముందస్తుగానే ఏర్పాటు చేయడమైనది.
అలాగే గ్రామస్తాయిలో రైతులకు యేవిధమైన సందేహాలు ఉన్న RSK ఇంచార్జ్ లేదా VRO వారిని సంప్రదించాలని లేదా మండలస్తాయిలో మండల వ్యవసాయ అధికారి లేదా తహశీల్దార్ వారిని సంప్రదించాలని కొరడమైనది.
5)రైతులు తమ సందేహాలు ఎక్కడనుండి అయిన నివృత్తి చేసుకొనుటకు TOLLFREE నెంబర్ 1967 లేదా జిల్లా కంట్రోల్ నెంబర్ 8121676653 కు ఫోన్ చేసి వారి సందేహాలను నివృత్తి చేసుకొనవలసిందిగా తెలియజేసారు.
    Scroll to Top