భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో జడ్పీహెచ్ హైస్కూల్లో బహుజన సమాజ్ పార్టీ నాయకులు ప్రధానోపాధ్యాయులు టీచర్స్ అందరూ కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బి.ఎస్.పి. పెరవలి మండలం అధ్యక్షులు బద్దజాను మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలనీ మరియు విద్యార్థినివిద్యార్థులు అంచెలంచెలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదివి చదవడమే కాకుండా పాఠశాలలో టీచర్స్ రాజ్యాంగం గురించి పిల్లలకు పాట రూపంలో తెలియపరచాలని ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులంటే ఏంటో తెలుసుకోవాలని తమ హక్కులు తమే కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు అంబేద్కర్ చదువుకోవాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలిసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అయినటి హెచ్ఎం మాట్లాడి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నమండల అధ్యక్షులు బద్ద జాన్ చదలవాడ రాంబాబు, జడ్పీహెచ్ హైస్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.