సంగీత పర్యాటకం, వారసత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో చేపట్టిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి హాజరైన కేంద్ర పెట్రోలు, సహజ వాయువులు, పర్యాటక సహాయక మంత్రి సురేష్ గోపి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక సలహాదారు జ్ఞానభూష్ , రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి గారు, టూరిజం శాఖ సెక్రటరీ వినయ్ చంద్ గారు, టూరిజం శాఖ ఎండి ఆమ్రపాలి కాటా. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆహార, చేనేత, హస్తకళలు తదితర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి జిఐ-ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు ప్రదర్శించిన స్టాల్స్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి సురేష్ గోపి, మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఉన్నతాధికారులు. సంగీతం, సంస్కృతి, పర్యాటకం, ఆధ్యాత్మిక సంపదను ప్రదర్శించడం ద్వారా “సంగీత పర్యాటకాన్ని” ప్రోత్సహిస్తోన్న మహత్తర కార్యక్రమంగా కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని అభివర్ణించి, కర్ణాటక సంగీతం, సాంప్రదాయ హస్తకళలు, వంటకాల వారసత్వానికి గొప్ప వేదికగా కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిలుస్తుంది అని, కృష్ణవేణి సంగీత నీరాజనం గొప్ప కార్యక్రమమే కాకుండా అద్భుతమైన పద ప్రయోగం అని అభివర్ణించారు. హిందూస్థాని, కర్ణాటక సంగీతాల మేళవింపు కృష్ణవేణి సంగీత నీరాజనం అని పేర్కొన్ని, కృష్ణవేణి సంగీత నీరాజనం ద్వారా సంగీత ప్రపంచానికి పునరంకితం, సంగీత వాగ్గేయకారులైన త్యాగరాజు, అన్నమాచార్యులు, రామదాసుల సంగీత పరంపరను కొనసాగించాలని, పినాకిణి, ద్వారం వెంకటస్వామి లాంటి వాగ్గేయకారులను అందించిన నేలను స్మరించుకుందామని, ఇప్పటికే కృష్ణవేణి సంగీత నీరాజనం ప్రారంభోత్సవ కార్యక్రమాలు శ్రీకాకుళం అరసవిల్లి దేవాలయంలో, రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో, మంగళగిరి, తిరుపతి, అహోబిలం లో జరిగాయాని వివరించి, రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవం, చారిత్రక, సంగీత వారసత్వ సంపద, పర్యాటకాన్ని పోషించుకోవాలని, ఏ రాష్ట్రంలో కళలు, సంస్కృతి పరిఢవిల్లుతుందో, ఏ రాష్ట్రంలో కళాకారులు సుభిక్షంగా ఉంటారో ఆ రాష్ట్రం పదికాలాలపాటు వైభవంగా వెలుగొందుతుందని, భరతనాట్యం, కూచిపూడి, హరి కథ, తోలుబొమ్మలాట, జమ్ములాట, సత్యాహరిశ్చంద్ర తదితర జానపద కళారూపాలను ప్రేక్షకులు పోషించుకోవాలని, ఆ బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉందని, కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, త్వరలో నృత్య అకాడమీకి చైర్మన్ వస్తారని తెలపి, కళలకు పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు., స్వయాన కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవానికి పునరుజ్జీవం వస్తుందని, గడచిన ఐదేళ్ల లో కుంటుపడిన సాంస్కృతిక, కళా రంగాన్ని పునరుజ్జీవింపచేసి నాటక రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామని, రాష్ట్రంలో సాంస్కృతిక పర్యాటకం, ఆధ్యాత్మిక, సాహస, చారిత్రక, పర్యావరణ పర్యాటకానికి పెద్దపీట వేసి పర్యాటక అభివృద్ధి చేస్తామని, భారతదేశంలో ఖ్యాతి పొందిన సుప్రసిద్ధ నటులు, ప్రస్తుత కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేష్ గోపి గారు అని వర్ణించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధి, దుర్గా ఘాట్ లో మూడు రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయని, రాబోయేరోజుల్లో ఈ తరహా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని, తెలుగు స్వరకల్పనల గొప్ప వారసత్వంలో సంగీత ప్రియులు లీనమైపోవాలని పేర్కొని, నేటి నుండి మూడు రోజుల పాటు (డిసెంబర్ 6,7,8,తేదీల్లో) కార్యక్రమం జరుగుతుంది అని, ఈ 3 రోజుల్లో 35 ప్రదర్శనలు, 140 మంది ప్రతిభావంతులైన కళాకారులు, అనుభవజ్ఞులైన మేస్ట్రోలతో ప్రదర్శనలు ఉంటాయని, నాగస్వరం, హరికథ, వోకల్ మరియు నామ సంకీర్తన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.