ప్రజలు నాయకుల దగ్గరికి వచ్చే కన్నా నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్లడం ఎన్నడూ చూడలేదని ఆ గ్రామాల్లో ప్రజలు అంటున్నారు,
ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కూడలి ప్రాంతాల్లో ప్రజలు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు. దీనిపై స్థానికులు గత ప్రభుత్వ విధానాల వల్ల తాము పడిన ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పలు సమస్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. పట్టణాల దీటుగా పల్లెల అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజలు నాయకుల దగ్గరికి వచ్చే కన్నా నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్లడం ఎన్నడూ చూడలేదని ఆ గ్రామాల్లో ప్రజలు అంటున్నారు, ఆయన వెంట జనసేన నాయకులు అడపా ప్రసాద్, చాపల రమేష్, పైబోయిన వెంకటరామయ్య జనసేన తెలుగుదేశం బిజెపి తదితర నాయకులు ఉన్నారు.