ఈ సెషన్‌లో గత కలెక్టర్ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, స్వర్ణాంధ్ర – 2047 అనే మూడు అంశాలను వివరించడం జరుగుతుంది.
- జీరో పావర్టీ, పి-4 మోడల్, డెమోగ్రాఫిక్ మేనేజ్‌మెంట్ తదతర అంశాలపై తీసుకున్న చర్యలుపై వివరించారు.
- రాష్ట్ర జనాభాలో 4 శాతం మంది అంటే 22 లక్షల మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు.
- నీతిఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం పేదల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిండం జరుగుచున్నది.
- పి-4 మోడల్‌తో మౌలిక వసతుల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
- డెమోగ్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని రూపొందించేందుకు సంబందిత శాఖల సహకారంతో చర్యలు చేపట్టడమైనది.
- జీఎస్‌డీపీ 2014-19 మద్యకాలంలో 13.50 శాతం ఉంటే.. 2019-24 మధ్య కోవిడ్, ఇతర సమస్యల వల్ల అది 10.59 శాతానికి పడిపోయింది.
- స్వర్ణ ఆంధ్ర-2047 మైలురాయి సాధించడానికి 15% వార్షిక వృద్ధిని సాధించడం తప్పనిసరి.
- అవసరమైన వృద్ధికి మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం వివిధ విధానాలను అమలు చేస్తోంది
- నియోజకవర్గ స్థాయిలో ఐదేళ్ల విజన్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి పలు పాలసీలను రూపొందించడం జరుగుచున్నది.
- స్వర్ణ ఆంధ్ర- 2047 విజన్ పర్యవేక్షించడానికి జిల్లా అధికారులకు సామర్థ్య నిర్మాణం, మార్గదర్శకత్వం అందించబడుతుంది
- వేగవంతమైన సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే ప్రాజక్టులను గుర్తించడం జరుగుతుంది.
- జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్లు (VMU)లు విజన్ ప్లాన్‌లను విజయవంతంగా పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
- విజన్ ప్లాన్‌లపై చర్చ, మార్గదర్శకత్వం కోసం శాఖల వారీగా అకడమిక్ నిపుణుల బృందాలను నియమించి జిల్లా స్థాయిలో వర్క్ షాపులను నిర్వహించాలని ప్రతిపాదించబడింది