కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ జిల్లాల కమిటీ సమావేశం మేక ఈశ్వరయ్య అధ్యక్షుడు ఆదివారం తణుకు బార్ అసోసియేషన్ లో జరిగినది .ఈ సమావేశంలో ఐలు ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ ఇప్పటివరకు న్యాయవాదుల వృత్తిలో ఏవైనా లోపాలు జరిగిన దానిపై విచారణ జరిగే అధికారం ఆ రాష్ట్రంలో ఉన్న బార్ కౌన్సిల్ ఉన్నదని మునిస్వామి అన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ అధికారాలను తగ్గించి న్యాయవ్యవస్థకు న్యాయవాదులపై చర్యలు తీసుకునే విస్తృత అధికారాలను కట్టబెట్టాలని ఆలోచనలు ఉన్నదని మునుస్వామి అన్నారు. జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వము ఇచ్చే స్టైపండ్ ఎన్టీఆర్ నేస్తం వెంటనే విడుదల చేసి జూనియర్ న్యాయవాదులను ఆదుకోవాలని మునిస్వామి అన్నారు. బార్ కౌన్సిలకు రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 35 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు జరిగే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విధానంలో జూనియర్ న్యాయవాదులను మినహాయించాలని మునిస్వామి బార్ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు. జూనియర్ న్యాయవాదులకు జిల్లాస్థాయిలో క్లాసులు నిర్వహించాలని, స్థానిక బార్ అసోసియేషన్ లో ఉన్న సమస్యలను గుర్తించి న్యాయమూర్తులు దృష్టికి తీసుకెళ్లాలని న్యాయవాదుల రక్షణకు సమగ్రమైన చట్టాన్ని ప్రభుత్వం చేయాలని న్యాయవాదులకు మెడికల్ ఇన్సూరెన్స్‌లను ప్రభుత్వ చెల్లించాలని పలుతీర్మానాలు సమావేశం చేసింది. ఈ సమావేశంలో జిల్లాకమిటీ సభ్యులు కొవ్వూరు వెంకటేశ్వర్లు, పి.పి.లక్ష్మి పామర్తి నగేష్, కెవి.సుబ్రహ్మణ్యం, ధనాల అప్పారావు, పి.పెద్దిరాజు, వీ.లలితకుమారి, జి.రాజారావు, వై.మణికంఠ, తేజ తదితరులు పాల్గొన్నారు.