సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలుగు దేశం, కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా బి.సి. నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టి.డి.పి.మహిళా నేత వావిలాల సరళాదేవి అద్యక్షతన తణుకు పట్టణంలో పూలే దంపతుల విగ్రహాలకు నివాళితో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి, పట్టణ బి సి అద్యక్షుడు గుబ్బల శ్రీనివాస్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలదండలు వేయగా అనంతరం నాయకులు వావిలాల వెంకట రమేష్, తామరాపు సత్యనారాయణ, రమణమ్మ, తమరాపు పల్లపురావు, చింతలపూడి సన్యాసిరావు, గుమళ్ళ హనుమంతు, రమణ భాస్కరరావు, వింజమూరి సుబ్రహ్మణ్యం, ఆకురాతి శ్రీనివాస్, తోట ఏసు, సూరాసాహెబ్, బత్తుల వెంకట రమణ, కాళే సత్తిబాబు, లింగమూర్తి, వాతాడ రంగనాథ్, వి.జ్యోతి, పి.కృష్ణకుమారి తదితరులు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలతో నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ భారతదేశానికి మహిళలకు విద్యను ప్రసాదించిన చదువులతల్లి అని మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు అంటే ఆతల్లి ఆరోజుల్లో ఆమెను రాళ్ళతో కొట్టినా, బురద జల్లినా, ఎన్ని అవమానాలు కష్టాలు పెట్టినా లెక్క చేయకుండా బాలికలకు చదువు నేర్పించటమే కాకుండా, పాఠశాలలు , సత్యశోధక్ అనే సంఘాన్ని స్థాపించి ఎంతోమంది అనాధలకు ఆశ్రమం కల్పిం చారు అని, కావ్య పూలే, అభ్యంగ్ అనే పుస్తకాలను కూడా రచించారు అని ఆమె జీవితవిశేషాలు వివరించారు. అనంతరం గుబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆమె జీవితచరిత్రను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియపరిచినారు.
