చిలకలూరిపేట పట్టణంలో శాంతి నగర్ కి చెందిన పాలపర్తి నాగరాజు @ తిమ్మిరి, 40 సం.లు వ్యక్తి పట్టణంలో డైక్మెన్ కాలని కి చెందిన అక్కల చెంచయ్య భార్య అక్కల నన్ని తో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో సుమారు నెల రోజులు నుండి అక్కల నన్ని తన భర్త చెంచయ్య ను వదిలేసి పాలపర్తి నాగరాజుతో కలిసి సుభానీ నగర్, పాత అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగరాజ పై కక్ష పెంచుకున్న చెంచయ్య తన అన్న కుమారుడు అక్కల ప్రభు దాసుతో కలిసి 02.01.2025 తేదిన రాత్రి 9.15 గంటలు సమయంలొ నాగరాజును తను నివాసం ఉన్న రేకుల ఇంటిలో చాకుతో గొంతు కోసి చంపినాడు. పట్టణ అర్బన్ సీఐ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.
