రానున్న కాలంలో ప్రజా సమస్యలుపై అలుపెరుగనిపోరాటం సాగిస్తుందని సి.పి.యం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పీవీ. ప్రతాప్, పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయకుమారి లు తెలిపారు. శుక్రవారం జిల్లా మహాసభలు భీమవరం జరుగుతున్న తరుణంలో సి.పి.యం పార్టీ శ్రేణులు భీమవరం తరలివెళ్ళారు.ఈ సందర్బంగా ప్రతాప్, అజయ కుమారిలు మాట్లాడుతూ సి.పి.యంపార్టీ ఏర్పడిన నాటి నుండి నేటివరకు పేద బడుగు బలహీనవర్గాల సమస్యలపై పోరాటం సాగిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారిన ప్రజలు సమస్యలు పరిష్కారం ఎందుకు కావడం లేదో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కమ్యూనిస్టులు పోరాటాలు వలనే ఎన్నో హక్కులు, చట్టాలు వచ్చాయని అన్నారు. కమ్యూనిస్టులు శాసనసభలలో లేకపోవడం వలనే ప్రజలు, కార్మికులు, రైతువ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని విమర్శించారు. భారతదేశ చరిత్ర ఒక్కసారి చూస్తే కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు తెలుస్తాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రజలు మధ్య మతం, కులం, ప్రాంతం పేరుతో విచ్చిన్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు పక్షాన సి.పి.యం రానున్న కాలంలో పెద్దత్తున పోరాటాలు సాగిస్తుందని తెలిపారు. భీమవరం 100బైక్ లతో ర్యాలీగా, ట్రైన్ లలో వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుబ్బల గోపి, సి.పి.యం నాగరత్నం, గార రంగారావు, వెంకటేశ్వరావు, అంబటి రామకృష్ణ, కడలి వీర రాజు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు
