తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముర్ల చిన్న(54) అనే వ్యక్తినీ అరెస్టుచేసి అతని వద్ద నుండి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో ఎస్సై ఆర్.మధుబాబు, హెడ్ కానిస్టేబులల్స్ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠరెడ్డి తెలిపారు.
