నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, కాకరపర్రు గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో ప్రజలందరి క్షేమంకొరకు అమ్మవారి ఆరాధనలో భాగమే జాతర అని అన్నారు. ఈ సంప్రదాయాలు మన భావితరాలకు మనమే వారధిలా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమినాయకులు, కార్యకర్తలు, కే.తదితరులు పాల్గొన్నారు.