ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కె. సుబ్బారావు మరియు జాయింట్ సెక్రటరీ పడాల సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉపాధ్యక్షులు టి. కుటుంబరావు, కమిటీ సభ్యులు జి. గంగాధరరావు, గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం కలిసి గత కొంతకాలం నుండి ఆంధ్రప్రదేశ్ లో లేయర్ పౌల్ట్రీ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ప్రభుత్వం ద్వారా సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు గతంలో లాగే చేయూత అందించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోళ్ళ పరిశ్రమ ఏదుర్కుంటున్న సమస్యలను విని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని పౌల్ట్రీ పరిశ్రమ సభ్యులు తెలిపారు.
