సజ్జాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు No.14, యందు శుక్రవారం తణుకు వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి ఆదేశముల మేరకు ప్యానెల్ న్యాయవాదులు, లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, సి.డి.పి.ఓ శ్రీమతి ప్రమోదీని కుమారి పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ 14 సంవత్సరాలలో ఉన్న పిల్లలు అందరు చదువుకోవాలని, యే ఒక్కరూ చదువుకూ దూరం కాకూడదని ప్రభుత్వం ఉచిత నిర్భంధ విద్య అమలు పరుస్తుందని, పిల్లల్ని పనులలో పెట్టుకోకూడదని, గ్రామాలలో మోతూబారుల దగ్గర పాలేరులుగా పెట్టుకుని వారితో వెట్టిచాకిరీ చేయించడం నేరమని, ప్రతి ఒక్కరూ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుని వారిని చదివించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, చైల్డ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు అధికారి శ్రీమతి ప్రమోదిని కుమారి, స్కూలు హెడ్ మాస్టర్ కె. నాగరాజు, సీనియర్ న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, లోక్ అదాలత్ ప్యానెల్ న్యాయవాదులు అజయ్ కుమార్ ఆంగజాల, సత్యనారాయణ తీర్రే, న్యాయవాదులు ధనుంజయ, భానోజీ రావు, పారా లీగల్ వాలంటీర్ లు బ్రహ్మాజీ పాల్గొన్నారు.
