నియోజకవర్గ అభివృద్ధి పై సిఎం తో చర్చించిన ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి
నియోజకవర్గ అబివృద్దికి ప్రణాళిక రూపొందిస్తామని హామీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని సీఎం చాంబర్ లో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కలిశారు. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించిలని కోరుతూ సీఎం తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కాసేపు చర్చించారు. దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. సిఎం సానుకూలంగా స్పందించి తమవంతు సహాయ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.