విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పరశురామరాజుని తెలుగు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం చీఫ్ అడ్వైజర్ ముళ్లపూడి కోటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ జార్జ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నందకుమార్ విశాఖ జిల్లా టీజెఫ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పీటర్ ప్రదీప్. ఈ కార్యక్రమంలో పాల్గొని పరశురామరాజుని అభినందించారు ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలుగా వారధిగా నడుస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య లో వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో విశాఖ కేంద్రంగా జర్నలిస్ట్ క్లబ్ ఏర్పాటు చేస్తానని బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు టీజెఫ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
