తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్, మహిళలకు గౌరవం ఇస్తాడని విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం – నవతరం పార్టీ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి వ్యక్తి మహిళలకు గౌరవం ఇస్తాడని మాజీ మంత్రి విడదల రజని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సర్టిఫికెట్ చెల్లదని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో అన్నారు.

చిలకలూరిపేటలో విడదల రజని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే హక్కు కోల్పోయిన విషయం మరచిపోయారని అన్నారు. సాక్షాత్తు పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ని పట్టుకొని “నీచుడు”అని సంభోదించడం విజ్ఞత ఉన్న మహిళలు మాట్లాడే భాష కాదని అన్నారు. అవినీతి ఘానాపాటి ప్రత్తిపాటి అని మాట్లాడుతూ ఉన్న పుల్లారావు నీకుమల్లె నువ్వు వసూలు చేసిన అవినీతి సొమ్ము పసుమర్రు రైతులకు తిరిగి ఇవ్వలేదని అన్నారు. నీమాదిరిగా అవినీతి నిరోధక శాఖ కేసులు ఎదుర్కొలేదని అన్నారు.

నీ చరిత్ర చూస్తే చెప్పలేనంత అవినీతితో కూడిన చరిత్రగా మిగిలిపోయిందని అన్నారు. నీవల్ల వైస్సార్సీపీ నుండి వందలాది మంది వెళ్ళిపోయిన విషయం తుగ్లక్ మహారాజు జగన్ గుర్తించలేక నిన్ను మళ్ళీ చిలకలూరిపేటకు ఇంచార్జ్ గా నియమించిన పెద్ద తప్పు చేసాడని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.అవినీతి కేసుల్లో తప్పించుకునే క్రమంలో బిజెపి, జనసేన పార్టీల్లో చేరెందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో ప్రస్తుతం వైస్సార్సీపీ లోనే కొనసాగక తప్పని పరిస్థితి రజనిది అని అన్నారు

మహిళలను వేదించడంలో నీకు మొదటి బహుమతి ఇవ్వాల్సివస్తుందని అన్నారు. శారద హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మి, ప్రభుత్వ వైద్యురాలు సుంకర భవాని, మండల విద్యాశాఖ అధికారిణి లక్ష్మీభాయి, ఎడ్లపాడు ఎంపిడివో స్వరూపారాణి ఇలా చాంతాడు అంత లిస్టు ఉందని అన్నారు.

నీవు చేసిన రౌడీచర్యలు వల్ల మా అమ్మ రావు చంద్రావతి పక్షవాతం భారిన పడి మరణించిందని రావు సుబ్రహ్మణ్యం మీడియాసమావేశంలో తెలిపారు.

చివరిగా ఏసీబీ కేసులో చిక్కుకున్న రజనికి ఏమి మాట్లాడాలో తెలియక అయోమయంలో ఎంపీ, ఎమ్మెల్యే లను తూలానాడటం అలవాటుగా మారిందని, ప్రభుత్వం ఉన్నపుడు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెట్టిన జగన్, రజనీలు ఇతరులను విమర్శించే హక్కు కోల్పోయారని, ఇతరులకు బురద అంటించే ప్రయత్నం మానుకోవాలని రావు సుబ్రహ్మణ్యం హితవు పలికారు. సమావేశంలో నవతరం పార్టీ పట్టణ అధ్యక్షురాలు షేక్ షమ్మీ పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link