మతసామరస్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

ముస్లింల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 5,434 కోట్లు

అత్తిలి ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతసామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి ముస్లిం జమాత్‌ మసీదులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్‌లో రూ. 5,434 కోట్లు ముస్లిం సోదరుల అబివృద్ధికి కేటాయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన ఎన్నో పథకాలను తిరిగి అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత బడ్జెట్‌ కంటే రూ. వెయ్యి కోట్లు అదనంగా కూటమి ప్రభుత్వం కేటాయింపులు చేశారంటే ముస్లింల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. త్వరలో ఇమాంలకు గౌరవ వేతనం రూ. 15 వేలు అందజేయడానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని చెప్పారు. ముస్లింల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారనీ, విదేశీ విద్యకు రూ. 25 కోట్లు, ఇమాంలు, మౌంజాల వేతనాలకు రూ. 90 కోట్లు, హజ్‌ యాత్రకు రూ. 14 కోట్లు కేటాయించగా గుంటూరులో హజ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మసీదులు, ఈద్గాలు, షాదీఖానాల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మైనార్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2014 నుంచి 2019 వరకు తాను అధికారంలో ఉండగా తణుకు నియోజకవర్గంలోని మసీదులు, షాదీఖానాల అభవృద్ధి కోసం కృÙ చేసినట్లు చెప్పారు. ఈద్గాల నిర్మాణానికి స్థలాలు త్వరలోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులకు ఎంతో విశిష్టమైన రంజాన్‌ మాసంలో ఎంతో కఠోర దీక్షతో చేసే ఉపవాసాలు ఫలితం రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అన్నారు. ఖురాన్‌లో చెప్పిన విధంగా ఏ మతమైనా ఒక్కటేనని, సమాజంలో మంచిని పెంపొందించే విధంగా సోదరభావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. ఈకార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link