ఇరగవరం మండల పరిధిలో కొత్తపాడు గ్రామపంచాయతీ కార్యవర్గంలో ఆకస్మికంగా ఏర్పడిన ఖాళీతో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో 27 మార్చి గురువారం నాడు ఉప ఎన్నిక నిర్వహించినట్లు మండల పరిషత్ అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో పదిమంది వార్డ్ మెంబర్లు గ్రామ సర్పంచ్ ఎన్నిక నిమిత్తం హాజరు కాగా సదరు ఎన్నిక కార్యక్రమంలో 8వ వార్డు మెంబర్ దొంగ శ్రీను రెండవ వార్డ్ మెంబర్ అయిన మండపాక విజయను అభ్యర్థిగా ప్రతిపాదించారు, ఆ ప్రతిపాదనను ఐదవ వార్డ్ మెంబర్ దండు వరహాల రాజు బలపరచగా, ఏ ఒక్క అభ్యర్థి ఆ ప్రతిపాదనకు తిరస్కరించకుండా ఆమోదించడంతో రెండవ వార్డ్ మెంబర్ మండపాక విజయ ఉపసర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.
