గత వైసీపీ హయాంలో ముస్లిం పథకాలు రద్దు చేసింది
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ఎమ్మెల్యే ఆర్థికసాయంతో రంజాన్ తోఫా పంపిణి
ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి ప్రయోజనాలు కాపాడటంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆర్థిక సాయంతో ముíస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఆయన అనంతరం మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ముఖ్యంగా ముస్లిం, మైనార్టీలకు సంబంధించి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి బడ్జెట్లో నిధులు అరకొరగా చేశారన్నారు. 2014–19 మధ్య కాలంలో చంద్రబాబునాయుడు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంగా రంజాన్ తోఫా, విదేశాల్లో విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సాయం, మక్కా వెళ్లేందుకు ఆర్థిక సాయం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాటిని రద్దు చేసి ముస్లిం, మైనార్టీ వర్గాలను నిరాశకు గురి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమాంలు, మౌజింలకు గౌరవవేతనం అందించడం, ముస్లిం మైనార్టీల కోసం బడ్జెట్లో రూ. 5,500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. షాదీఖాలనాల అభివృద్ధి, పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి, మాక్కా వెళ్లే వారికి ఆర్థికసాయం చేసేందుకు కేటాయింపులు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.