పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న కార్యకర్తలు
పట్టిన జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ ఏ పిలుపు ఇస్తే అ పిలుపును అమలు చేస్తూ పార్టీయే పరమావధిగా భావించిన కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ సదంర్భగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, బోళ్ల బులిరామయ్య, వైటీ రాజా, ముళ్లపూడి వెంకటకృష్ణారావులతోపాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు తణుకు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీను కంచుకోటగా మార్చారని అన్నారు. 43 సంవత్సరాలు పార్టీకు వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 43 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ పార్టీకు సేవలు అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, సీనియర్ నాయకులు పచ్చిపాల కృష్ణమూర్తి, ఒమ్మి రాంబాబు, పంపన పద్మారావు, దంపనబోయిన శేషగిరి, తాతపూడి మారుతీరావు, నల్ల బాస్కరారావు, తమరాపు సత్యనారాయణలను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి నూతన దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.