టిజేఎఫ్ మరో అద్భుత విజయం

  • అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
  • అలరించిన చిన్నారుల నృత్యాలు
  • పలువురు జర్నలిస్టులకు పురస్కారాల ప్రధానం
  • నిర్వాహకులకు అతిధుల ప్రశంసలు
  • జర్నలిస్ట్ లకు టీజెఫ్ నిరంతరం తోడు
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న టీజెఫ్
  • తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం విశాఖలో నిర్వహించిన ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా నిర్వహించారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు పి. ఈశ్వర చౌదరి అండ్ టీం ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. చక్కటి హావభావాలతో సంగీతానికి తగినట్లు నృత్య భంగములతో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులను అతిధుల చేతుల మీదుగా సత్కరించడం శుభ పరిణామం. తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు అందరూ సమన్వయంతో కలిసిమెలిసి పనిచేస్తూ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.
  • ఈ సందర్భంగా అతిధులు నిర్వాహకులను ప్రశంసించారు.
  • తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ ప్రారంభించిన అనంతకాలంలోనే జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
  • ఫోరం ప్రతినిధులు ఎటువంటి స్వలాభపేక్ష లేకుండా, నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ ఫోరంలో మెంబర్ గా కొనసాగడం చాలా సంతోషంగా ఉందని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఉగాది సంబరాలను నిర్వహించిన తీరే ఫోరం యొక్క పారదర్శకతను తెలియజేస్తుంది. మరొకసారి ఈ కార్యక్రమ నిర్వహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాo.
Scroll to Top
Share via
Copy link