మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
సతీమణి పై జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వెంటనే అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం మరియు అరెస్ట్ చేయడం మంచి పరిణామం. స్వంత పార్టీ వారైనా హద్దులు దాటితే అన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా వ్యవహరించాలి.వ్యక్తిత్వ హననం, అసభ్య కర వ్యాఖ్యలు చేసిన వారిపై పూర్తి నిఘా పెంచాలని , అన్ని స్థాయిలలో ఇలాంటి వ్యక్తుల చేష్టలపై కఠినంగా చర్యలు తీసుకొంటే రాజకీయాలలో
ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది.
ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది.
ప్రభుత్వ విధానాలు, ప్రజాపాలనలో ఉన్న లోపాల్ని ఎత్తిచూపడం ప్రతిపక్షం బాధ్యత.
అందుకోసం చేసే సూచనలు కానీ, విమర్శలు కానీ హేతుబద్ధంగా స్వీకరించాలి.నాయకులు సంయమనంతో ఉంటూ కార్యకర్తలను కూడా కట్టడి చేయవలసిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుంది.
