భారతదేశంలో గర్వించే మహాప్రస్థానంలా సాగింది..
చిత్ర రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగింది…
మనిషిలోని ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చి
ఎందరో శిష్యులకు జీవిత బాటనిచ్చిన గురువు స్థానానికి ఎదిగింది..
( మోహన్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, బాబు మోహన్, మురళీమోహన్ జయప్రద, జయసుధ లాంటి ఎందరో ఉత్తమ నటులను పరిచయం చేశారు)
అటువంటి మహోన్నత జీవితం గడిపిన జీవి పేరు దర్శకరత్న దాసరి నారాయణరావు ..
ఒక దర్శకుడికి భారీ స్థాయిలో అభిమాన సంఘాలు
ఉండటం ఒక్క దాసరి నారాయణరావుకే సాధ్యం అయింది..
పదికి పైగా హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక దక్షణాది దర్శకుడు..
చిత్ర పరిశ్రమలో ఏదైనా సమస్య అంటే ఎటువంటి వారైనా తట్టే తలుపు ఇంటి పేరు ” దాసరి “