కుంభకోణాలు వైసీపీ నేతలకు పేటెంట్‌

జగన్‌ చేసిన స్కాంలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు

కుట్టుమిషన్ల స్కాం అంటూ వైసీపీ నేతల బీరాలు

కావాలనే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం

ధ్వజమెత్తిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

కుంభకోణాలు చేయడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేటెంట్‌ హక్కుగా భావించారని అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కుంభకోణాలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలల పాటు జైలుశిక్ష అనుభవించిన జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడి రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. శుక్రవారం తణుకులోని కూటమి కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో రూ. 3500 కోట్లు దోచుకుని బెంగళూరులో పెట్టుబడులు పెట్టుకున్నారని ఆనాడు మద్యం దుకాణాల్లో డిజిటల్‌ పేమెంట్లు నిలిపివేసి కేవలం నగదును స్వీకరించి తాడేపల్లి ప్యాలెస్‌ తద్వారా బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ చేశారని ప్రస్తుతం పెద్ద ఉత్తున మీడియాల్లో కథనాలు వస్తున్నాయని చెప్పారు. అలాంటి కుంభకోణాలు చేసిన వ్యక్తులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా మహిళలకు సైతం రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మందికి కుట్టుమిషన్లపై శిక్షణ ఇస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కుట్టుమిషన్ల కుంభకోణం జరిగిందని వైసీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. టెండర్లు విధానంలో పారదర్శకంగా కుట్టుమిషన్ల శిక్షణకు సంబంధించి లక్ష్యానికి అనుగుణంగా శిక్షణ అనంతరం కుట్టుమిషన్లు అందించేందుకు ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. 90 రోజుల పాటు శిక్షణలో భాగంగా నిర్థిష్టమైన లక్ష్యాలకు అనుగుణంగా నూటికి నూరు శాతం ప్రొఫెషనల్‌గా శిక్షణ ఇచ్చేందుకు పారదర్శకంగా టెండర్లు ఖరారు చేసినట్లు చెప్పారు. బీసీ, ఎస్సీ మహిళలకు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికాభివృద్ధి తద్వారా మహిళా సాధికారత సాధించే విధంగా ప్రభుత్వం పథకం తీసుకువచ్చిందన్నారు. వైసీపీ నాయకులు చేసిన కుంభకోణాలకు పక్కదోవ పట్టించే విధంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. నిర్థిష్టమైన లక్ష్యాలతో అవినీతికి తావు లేకుండా టెండర్లు ఖరారు చేసి ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, దేశ ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. అంతుకు ముందు తణకు నియోజకవర్గంలో 11 మంది లబ్థిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 6.88 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link