భాగ్యనగరంలో ప్రపంచ సుందరి పోటీలు

భాగ్యనగరంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలు నిర్వహణ గురించి వావిలాల సరళాదేవి మాట్లాడుతూ మే 7 నుండి 31 వరకు‌ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలకి నేను తెలియచేయు విషయం అర్థనగ్న ప్రదర్శనలతో మన సాంప్రదాయంని పక్కనపెట్టి పోటీల్లో విజేతలకు కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చే బదులుగా మన దేశంలో ఆర్థికంగా, నిరక్షరాస్యతతో, అనారోగ్యం కారణంగా ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారిని ఆదుకుంటే దేశానికి ఎంతోమేలు చేసిన వారవుతారు కదా అని సరళాదేవి ప్రశ్నిస్తూ వీరనారీమణుల అహల్యబాయి, జిజియాభాయ్, రాణి రుద్రమదేవి లాంటి తెలుగు వీర నారీమణులు జన్మించిన ఈ గడ్డపై అర్థనగ్న ప్రదర్శనలతో అందాల పోటీలు నిర్వహించి మన సంస్కృతిని కించపరిచటమే అన్నారు. మహీళలను అబివృద్ధికి ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని లేని ఎడల యువతులు ఇలాంటి ప్రదర్శన వలన పెడదారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఈమె వెంట మాసాబత్తుల నాగమణి, ఎస్ విజయలక్ష్మీ, కె.సుబ్బలక్ష్మి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link