తణుకు పట్టణంలో ఈరోజు ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణం లోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ (ఆర్ట్స్) ప్రభుత్వ కళాశాల నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ఏర్పాటు చేసిన పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమం లో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. అధ్యక్షులు మస్తాన్ రావుకి, గమని రాంబాబుకి మిగిలిన పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలిపినారు. ముఖ్యంగా పోలియో రహిత సమాజాన్ని ఏర్పరచడానికి గత అనేక సంవత్సరాలుగా పోలియో నివారణకు అన్ని ప్రభుత్వాలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు. పోలియో వ్యాక్సినేషన్ కనుగొనడానికి బృందంగా ఏర్పడి ఆబృందానికి నాయకత్వం వహించినటువంటి డాక్టర్ జాన్సన్ సాల్క్ గారి జయంతి సందర్భంగా అక్టోబర్ 24న పోలియోడే జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. రోటరీ క్లబ్ పోలియోనివారణ అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోలియో వ్యాక్సినేషన్ గాని నివారణ గాని 122 దేశాలుగా ప్రతి సంవత్సరం 40 వేల కోట్లు రూపాయలు ఈ రోటరీ క్లబ్ ద్వారా వెచ్చించిందన్నారు. ఈ విధంగా పోలియో నివారణ కొరకు రెండు పోలియోచుక్కలు వేసి పసిపిల్లల భవిష్యత్తును కాపాడాలని, రోటరీ క్లబ్ అవగాహన పోలియో నివారణ రహిత సమాజంగా భారతదేశం తీర్చిదిద్దాలని కోరుకుంటున్నామని అన్నారు.
