డదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణ, మండలం, ఉండ్రాజవరం, పెరవలి మండలాలలో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మొత్తం 49 మందికి 28,98,500 రూపాయుల చెక్కులను ఆదివారం వేలివెన్ను నివాసంలో అందచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు. ఈ సందభంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్ధికంగా ఇబ్బందులున్నా సంక్షేమం, అబివృద్ది విషయంలో ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల ఆరోగ్యంపట్ల కూడా భాద్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి మండల, గ్రామ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.
