వికసిత భారతదేశపు అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వికసిత్ భారత్ సంకల్పసభ కార్యక్రమం సొమవారం తణుకు పట్టణంలో బిజేపి నాయకురాలు డా.ముళ్ళపూడి రేణుక స్వగృహం వద్ద తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా బిజేపి ప్రభుత్వము పేదప్రజల సంక్షేమం, భారతదేశ ఔన్నత్యం కొరకు పాటిస్తున్న విదేశీ విధానాలు, మేకిన్ ఇండియా ద్వారా మనదేశంలో తయారవుతున్న అనేక వస్తువులు, జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ది వంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రగతి మరింత వేగంగా జరుతుందని డా. ముళ్ళపూడి రేణుక అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కామర్సు ధనలక్ష్మి కిరణ్మయి, పట్టణ ఉపాధ్యక్షులు అనుకుమార్, బిజెపి నాయకులు జితేంద్ర, పి.వీరభద్రం కార్యకర్తలు పాల్గొన్నారు.
