తల్లికి వందనం తిప్పలు : రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు : తల్లికి వందనం పేరిట ప్రభుత్వం 15వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. 12వ తేదీ నుండి ఈ పథకం ప్రారంభం కాగా … విద్యుత్ వినియోగం 3 యూనిట్లు దాటిందని సుమారు 300మంది ఉండ్రాజవరం సబ్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం నుండి వేచి చూస్తున్నారు. తాము ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణములు వాడకపోయినా 300 యూనిట్లు దాటిందని లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం జరిగిందని సచివాలయంలో తెలపడంతో విద్యుత్ కార్యాలయాలకు పరుగులు పెట్టామని, ఉదయం నుండి కార్యాలయం వద్ద వేచి చూస్తున్నా సరియైన జవాబు చెప్పేవారు లేరని ప్రజలు వాపోతున్నారు.
