పశ్చిమ గోదావరి జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, జిల్లా కార్యాలయం భీమవరం నందు సొమవారం నిర్వహించిన కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై ” వై.యస్. జగన్ అంటే నమ్మకం.. నారా చంద్రబాబునాయుడు అంటే మోసం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చిన్నమిల్లి రాయుడు, ఎమ్మెల్సీ కావూరు శ్రీనివాస్, వైసీపీ రాష్ట్ర మాజీ చైర్మన్ లు, డైరెక్టర్లు, కో అప్షన్ సభ్యులు, ఇంచార్జ్ లు, ప్రెసిడెంట్లు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అద్యక్షులు, నియోజవర్గ అనుబంధ విభాగాల అద్యక్షులు, మండల ప్రెసిడెంట్లు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
