వికసిత భారత్ అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి లక్ష్యంతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తణుకు పట్టణ 13వ వార్డులో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తణుకు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకురాలు డాక్టర్ ముళ్ళపూడి రేణుక మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రాథమికంగా అందిస్తున్న వైద్య సేవలపై ఆసుపత్రి సిబ్బందితో చర్చించి తగ సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సహాయం కోసం వచ్చిన వారిని ఏ విధంగా వారితో ప్రవర్తించాలో సిబ్బందితో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి సుమారు 5000 మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఇప్పటికే మంజూరయ్యాయని ప్రధానమంత్రి మోడీ 11 సంవత్సరాల ఆయన ఈ దేశానికి చేస్తున్న సేవలు పథకాలు గురించి వివరించారు. ఈ సందర్శించిన సందర్శనలో తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షులు కామర్స్ ధనలక్ష్మి, కిరణ్మయి తణుకు పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు నందమూరి శ్రీనివాస్, తణుకు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు గంటా లక్ష్మి, తణుకు పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు అనుకుమార్, బిజెపి సీనియర్ నాయకులు కొడమంచిలి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
