11 ఏళ్ల మోడీ ప్రభుత్వం – సంకల్పంతో సాకారం

11 ఏళ్ల మోడీ ప్రభుత్వం- సంకల్పంతో సాకారం కార్యక్రమంలో భాగంగా వికసిత భారత్ సంకల్ప సభ రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆద్వర్యంలో మండల బిజెపి అధ్యక్షులు ఆకేటి శ్రీ కృష్ణ అద్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా. ముళ్ళపూడి రేణుక, అనకాపల్లి జిల్లా బిజెపి ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు, కిసాన్ సెల్ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ తదితరులను సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు మరియు బిజెపి నాయకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా,స్కూల్ విద్యార్ధులు మార్చ్ పాస్ట్ చేస్తూ మేళ తాళాలతో పువ్వులు జల్లుతూ వేదిక వద్దకు తీసుకెళ్లారు, అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిధులు, ప్రధాని మోడీ 11సంవత్సరముల వికసిత భారత దేశపు అమృత కాలం సుపరిపాలన సేవ పేదల సంక్షేమం గురుంచి, మోడీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి,వివిధ పథకాల అమలు గురించి, 2047 నాటికి భారత దేశ పురోగతి, అందులో మన పాత్రపై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు.

బిజెపి నాయకులు సలాది వీరబాబు అందరిచేత వికసిత భారత్ 2047 ప్రతిజ్ఞ చేయించారు.

ముఖ్య వక్తగా విచ్చేసిన రేణుక ని సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు అందరూ పసుపు కుంకుమలతో, పట్టు వస్త్రములతో ఘనంగా సత్కరించారు.

ముఖ్య అతిథిలు, బిజెపి నాయకులు కలిసి మొక్కలను నాటారు, ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, బిజెపి సీనియర్ నాయకులు దొంతంశెట్టి ఓం ప్రకాష్, రామచంద్రపురం నియోజకవర్గ కో-కన్వీనర్ సలాది చంద్రశేఖర్, బిజెపి నాయకులు బీవీఆర్ చౌదరి, కొట్టువాడ హరిబాబు, అవసరాల వెంకట రమణ మూర్తి, గంగవరం మండల బిజెపి అధ్యక్షులు, ఓబీసీ అధ్యక్షులు ఇంధన సత్యనారాయణ, బీజేపీ కార్యకర్తలు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link