సారా రహిత మండలంగా పెరవలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా చేయుటకు చేపట్టిన “నవోదయం 2.0” కార్యక్రమంలో భాగంగా నిడదవోలు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పెరవలి మండలంలో గతంలో నాటు సారాయి కేసులు నమోదు కాబడిన కానూరు, కానూరు అగ్రహారం, నడుపల్లి కోట మరియు ఉసులుమర్రు గ్రామాలను ‘C’ కేటగిరీ గ్రామాలుగా వర్గీకరించి గతంలో నాటుసారాయి కేసులలోని నిందితుల యొక్క ప్రస్తుత స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మరియు గత రెండు సంవత్సరాల కాలంలో పైన తెలిపిన గ్రామాలలో ఎటువంటి నాటుసారాయికి సంబంధించిన కేసులు నమోదు కాకపోవడం మరియు ప్రస్తుతం పైన తెలిపిన గ్రామాలలో ఉన్న సారాయి నిందితులు వారి జీవనభృతి కొరకు వేరే వృత్తుల్లో కి మారిపోవడం వలన సదరు గ్రామాలు నాటు సారాయి రహిత గ్రామాలుగా అయినందున, పెరవలి మండలాన్ని నాటు సారాయి రహిత మండలం గా ప్రకటించడమైంది. ఈ కార్యక్రమంలో పెరవలి మండల MDO గారు, MRO గారు, పెరవలి సివిల్ పోలీసు వారు, ZPTC గారు, MPP గారు మరియు నిడదవోలు ఎక్సైజ్ CI గారు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

