వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు “ఫైలేరియా ఉధృతి నివారణా నిర్వహణా కిట్స్(మార్బిడిటి మేనేజ్మెంట్ డీజెబిలిటీ ప్రివెన్షన్ కిట్స్) పంపిణీ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.ఎం.ఆర్.కిశోర్ అధ్యక్షతన గ్రామసర్పంచ్ శ్రీమతి విశ్వనాథం కృష్ణవేణి ప్రారంభించి, మాట్లాడుతూ “ఫైలేరియా వ్యాధి గ్రస్తులు ఈ ఫైలేరియా కిట్స్ ను సద్వినియోగం చేసుకుని ఎప్పటికపుడు శుభ్రం చేసుకోవాలని,ఫైలేరియా రహిత సమాజానికి కృషి చేయాలని” కోరారు.మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.ఎం.ఆర్.కిషోర్ మాట్లాడుతూ “పి.హెచ్.సి.ద్వారా అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను వివరించారు.రెండవ మెడికల్ డాక్టర్ కె. సాయి భవాని మాట్లాడుతూ”జ్వరం తో పాటు చంకల్లో గజ్జల్లో బిళ్ళ కడుతున్నట్లయితే విధిగా డాక్టర్స్ ను సంప్రదించాలని”కోరారు. స్థానిక నాయకులు రెడ్డి నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ” డాక్టర్స్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ, వారు అందించే సేవల వినియోగం ద్వారా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని” కోరారు.సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ”ఫైలేరియా వ్యాధి ఇన్ఫెక్టెడ్ ఆడ క్యూలెక్స్ దోమకాటు వలన రావడానికి అవకాశం ఉందని, ఈ దోమ మురుగు నీటి నిల్వలలో గుడ్లు పెడుతుందని,ఇవ్వన్నీ దోమలుగా మారతాయని, అందువలన ఇంటి ఆవరణలోగానీ,పరిసరాల్లో గానీ మురుగు నీటి నిల్వలు ఉంటే వేస్ట్ ఇంజన్ ఆయిల్ చల్లుకోవాలని,మలేరియా, డెంగ్యూ,చికున్ గున్యా వ్యాధులను వ్యాప్తి చేసే దోమల పుట్టుకకు చెక్ పెట్టడానికి”ఫ్రైడే డ్రైడే”పాటించాలని కోరారు. ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ కె.సత్యన్నారాయణ మాట్లాడుతూ”ఫైలేరియా కిట్ ను వినియోగ విధానాన్ని వివరించి, ప్రతి బుధవారం రాత్రి తణుకు ఫైలేరియా కంట్రోల్ యూనిట్ వద్ద నైట్ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు” తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సుంకర వెంకట్రావు, బి.సి.నాయకులు గుత్తుల రంగారావు, స్థానిక నాయకులు విశ్వనాథం శ్రీనివాస్, ఆర్.కేశవరావు,సి.హెచ్. ఓ.ఉదయలక్ష్మి,హెల్త్ సూపర్ సూపర్వైజర్ ఎ.శ్రీ రామమూర్తి, ఫార్మాసిస్ట్ జి.వి.సోమశేఖర్,హెల్త్ అసిస్టెంట్స్,విలేజ్ హెల్త్ సెక్రెటరీలు,ఎ.ఎం.ఎం.లు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
