వికసిత భారతదేశపు అమృత కాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే నినాదాలతో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలనా కాలం పై కరపత్రాలను ఆచంట మండలంలోని వేమవరం ,పెనుమంచిలి, కందరవల్లి, కరుగోరిమిల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పంచి పెట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు, అవినీతి రహిత పాలన గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో మండల బిజెపి అధ్యక్షులు నేదునూరి శ్రీనుబాబు, మాజీ మండల అధ్యక్షుడు ముచ్చర్ల నాగసుబ్బారావు, నియోజకవర్గ కో కన్వీనర్ కొత్త భాస్కర నాగభూషణం, ప్రధాన కార్యదర్శి అందే బసవ గణపతి, ముత్యాల వెంకట్రాయుడు, దిర్శిపో శ్యాంబాబు, నేలపాటి ఏసురత్నం, చెల్లుబోయిన ఉమామహేశ్వరరావు, చామన శ్రీనివాస్, బోడపాటి మాచిరాజు, నార్గన దుర్గా ప్రసాద్, కాసుల సత్య సాయి, చిలుకూరి సత్యనారాయణ,వడలి రవి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
