అంతర్జాతీయ మాదకద్రవ్య వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం – జూన్ 26 ను పురస్కరించుకొని సమిశ్రగూడెంలో గల “వికాస్ జూనియర్ & డిగ్రీ కాలేజ్” నందు విద్యార్ధినీ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు NDPS చట్టం 1989 ప్రకారం మాదకద్రవ్య వినియోగం, రవాణా, కోనుగోలు మరియూ అమ్మకం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడితే విధించే శిక్షలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “*ఈగల్ టీమ్స్” *(EAGLE Teams)”—Eradication of Anti-social Groups and Lethal Elements— గురించి మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “నషాముక్త్ భారత్” గురించి విద్యార్ధినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అలాగే డ్రగ్స్ దుర్వినియోగం లేదా సరఫరా గూర్చి ఏవైనా సమాచారం ఉన్నట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు ఫోన్ చేసి తెలియజేయాలనిమీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
మత్తు అనే విషవలయాన్ని చేధిద్దాం – ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. అని విద్యార్ధినీ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు
ఈ కార్యక్రమంలో వికాస్ సంస్థల విద్యార్ధినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, డైరెక్టర్లు, నిడదవోలు ప్రోహిబిష్ , ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.