చంద్రబాబు కృషితోనే సాంకేతికత అభివృద్ధి
ఆర్పీలకు ట్యాబులు అందజేసిన ఎమ్మెల్యే
సాంకేతిక పరిజ్ఞానాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషితోనే పరిపాలనలో సాంకేతికత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రతి రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేశారన్నారు. తణుకు కూటమి కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్పీలకు రూ. 30 వేలు విలువైన ట్యాబులను అందజేసి మాట్లాడారు. తణుకు పట్టణంలోని 49 పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని 49 మంది ఆర్పీలకు రూ. 14.70 లక్షలు విలువైన ట్యాబులను అందజేశారు. ముఖ్యంగా 1500 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఎస్‌ఎల్‌ఎఫ్, ఆర్పీలకు సంబంధించి మరింత వేగంగా పని చేసేందుకు వీలుగా ట్యాబులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకు లింకేజీ ద్వారా తణుకు పట్టణంలో 9.95 శాతం వడ్డీతో 58 గ్రూపులకు రూ. 45 కోట్లు పైగా రుణాలు అందించిట్లు చెప్పారు. ట్యాబుల ద్వారా వారి కార్యకలాపాలను అనుసంధానం చేసే వి«ధంగా డ్వాక్రా మహిళలకు సేవలు మరింత సరళతరం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. డిజి లక్ష్మి ద్వారా మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మీ సేవ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా ఎస్‌ఎల్‌ఎఫ్ స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాలంభన సాధించేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.