విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు నుండి సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ మరియు వార్డ్ సీనియర్ నాయకులు గోలగాని రవిఈశ్వరరావు ఆధ్వర్యంలో 29వ వార్డు నుండి పలు ఆటో స్టాండ్ ల వారు వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యాలయానికి తరలి వెళ్లి వంశీకృష్ణ శ్రీనివాస్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 3,000 మంది ఆటో డ్రైవర్ సోదరులకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేయటం చాలా ఆనందమైన విషయమని నియోజకవర్గంలో అన్ని సమస్యల పైన అవగాహన కలిగిన నాయకుడిని మన శాసనసభ్యులుగా చేసుకోవడం మన అదృష్టమని, వంశీకృష్ణ శ్రీనివాస్ సారధ్యంలో దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు.
29 వ వార్డు ఆటో డ్రైవర్ సోదరులందరూ మాట్లాడుతూ ముందుగా ఇంతటి మంచి కార్యక్రమం తలపెట్టిన వంశీకృష్ణ కి తమ ఆటో డ్రైవర్ కార్మిక సోదరులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారని దక్షిణ నియోజకవర్గం లో వంశీకృష్ణ శ్రీనివాస్ అభివృద్ధి పథంలో తనదైన ముద్రను వేసుకుంటున్నారని అంతేకాకుండా తమ ఆటో డ్రైవర్ కార్మిక సోదరులందరి మద్దతు వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి గిరిబాబు, 29వ ఆటో కార్మిక సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
