స్థానిక సమస్యలపై ఆరా… తక్షణమే పరిష్కారానికి ఆదేశాలు జారీ
ఉండ్రాజవరంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ కు ఘనస్వాగతం పలికిన స్థానిక గ్రామస్థులు
బుర్రిలంక, ఉండ్రాజవరం గ్రామాల్లో ఇటీవల మరణించిన జనసైనికుల కుటుంబాలకు పరామర్శ..ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులకు ఓదార్పు
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని వివరించిన మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజానీకంతో ముఖాముఖి చర్చించారు. గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ తక్షణమే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న త్రాగునీరు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త, వితంతు పెన్షన్లు, పిండప్రదానాలు చేసేందుకు అవసరమైన స్థలం, ధాన్యం సేకరణ డబ్బులు, వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కొందరు గ్రామస్థులు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు త్వరలోనే జమ చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కారిస్తానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ కు స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు.
అంతకుముందు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని బుర్రిలంక గ్రామంలో ఇటీవల మరణించిన జనసైనికుడు రత్నం వెంకట రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నిడదవోలు పట్టణం ఏబీఎస్ టౌన్ హాల్ నందు మానవత నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉండ్రాజవరం గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురూ మరణించిన జనసైనికుడు దువ్వాపు సత్యప్రకాష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.