వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ‘పునర్వి హోల్‌సేల్ పేరిట’ నూతన హోల్‌సేల్ వస్త్రాల షోరూమ్ ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు పెద్ద సంఖ్యలో వస్త్ర వ్యాపారులు హాజరయ్యారు. ఈ షోరూమ్‌ను ప్రారంభించిన ప్రముఖ డిజైనర్ పునర్వి రమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. ఇలాంటి కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు నగర ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతుంది. ఈస్ట్ పాయింట్ కాలనీ లో ప్రారంభించాం అని ఈ షోరూమ్ అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, స్థానిక వస్త్ర వ్యాపారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలలో అందుబాటులోకి తీసుకువస్తుంది” అని ప్రశంసించారు. అనంతరం నవరతన్ మాట్లాడుతూ, “మా లక్ష్యం నాణ్యతతో కూడిన వస్త్రాలను తక్కువ ధరకే అందించడం. మా షోరూమ్‌లో అన్ని రకాల దుస్తులు – పట్టు చీరలు, కాటన్ చీరలు, డిజైనర్ లెహెంగాలు, ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్, దుస్తులు హోల్‌సేల్ ధరలకే లభిస్తాయి. దేశంలోని ప్రముఖ వస్త్ర తయారీదారుల నుండి నేరుగా సేకరించిన కొత్త స్టాక్ మా వద్ద అందుబాటులో ఉంటుంది. మా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లను అందుబాటులో ఉంచుతాము” అని వివరించారు.
ఈ కొత్త షోరూమ్ విశాలమైన స్థలంలో, ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడింది. వ్యాపారులకు సులభంగా దుస్తులను ఎంచుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.
