ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కార్యాలయం వద్ద ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్( CITU)రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహా ధర్నా జరిగింది. పట్టణ విస్తరణ కనుగుణంగా మునిసిపల్ కార్మికులు సంఖ్య పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇంజనీరింగ్, క్లాప్ కార్మికులకు రూ. 24500/-ఇవ్వాలని, చట్టప్రకారం ఉన్న సెలవలు ఇవ్వాలని, పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని,సంక్షేమ పథకాలు అమలు చేయాలని, PF, ESI లలో సమస్యలు తొలగించాలని,వాహనాలు రిపేర్లు చేయాలని, విజయవాడ వరదలు టైమ్ లో పని చేసిన కార్మికులకు ఒక నెల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, క్లాప్ డ్రైవర్లు వేతన బాకీలు వెంటనే ఇవ్వాలని పెద్దతున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా జరిగిన ధర్నా నుద్దేశించి ప్రతాప్ మాట్లాడుతూ… ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటికి మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరం అన్నారు. గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వైస్సార్సీపీ ఘోరంగా విఫలం అయిందని విమర్శించారు. ఎన్నో ఆశలతో కూటమికి కార్మికులు మద్దత్తు ఇచ్చారని గుర్తు చేశారు. కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం చిత్త శుద్ధి తో ప్రయత్నం చేయాలని లేకుంటే భవిష్యత్తులో సమ్మెకు కూడా వెనకాడబొమని ప్రతాప్ హెచ్చరించారు… ఇంజనీరింగ్ సెక్షన్ యూనియన్ అధ్యక్షులు ఉండ్రాజవరం శ్రీను మాట్లాడుతూ… గత అనేక సంవత్సరాలనుండి పని చేస్తున్నప్పటికి మాకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని అన్నారు.మేము రెగ్యులర్ ఉద్యోగులు గా చూపించి మాకుటుంబాలలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. మాకు చట్ట ప్రకారం సెలవులు ఇవ్వాలని పేర్కొన్నారు…. క్లాప్ డ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి Mtvv. గణేష్ మాట్లాడుతూ… గత మూడు సంవత్సరాలనుండి చెత్త సేకరణ వాహనాలు నడుపుతున్నామని మాకు నేటికీ కనీస వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు. గత మూడు నెలలు గా వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని ఆర్థికంగా వేదిస్తున్నారని తెలిపారు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు….. మునిసిపల్ యూనియన్ కార్యదర్శి యన్. ఆదినారాయణ బాబు మాట్లాడుతూ… మా సమస్యలు అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద మనసుతో అలోచించి పరిష్కారం చేయాలని, లేకుంటే పోరాటమే శరణ్యం అన్నారు.ఈ ధర్నా అనంతరం మునిసిపల్ కమిషనర్ రామ్ కుమార్ కి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా నాయకులు అడ్డగర్ల అజయ కుమారి, గార రంగారావు, అర్జీ కృష్ణ బాబు,మందులయ్య, రాణి, అయ్యప్ప,జి. విజయకుమార్, శ్రీదేవి, పడాల దానం, నాగబాబు,తాతారావు, ఆదినారాయణ, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
