ఉండ్రాజవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండ్రాజవరం గ్రామంలో కొలువైన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆశ్వీయుజ మాసం మంగళవారం సందర్భముగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అలంకరణ జరిగిందని, భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించారని, తీర్థప్రసాదాలు స్వీకరించారని పురోహితులు మద్దిరాల ఏడుకొండలు తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link