జన్మదినం సందర్భంగా విశాఖ నలుమూలలా సేవా కార్యక్రమాల సందడి
వృద్ధ జర్నలిస్టులకు నెలవారీ పింఛన్లకు ఎంపిక ఆశ్రమాలకు పళ్ళు పంపిణీ – అభిమానుల ఆవేశాత్మక ఆత్మీయత
తన జీవితాన్ని విలేఖరుల సంక్షేమానికి అంకితం చేసిన డా. కంచర్ల అచ్యుతరావు జన్మదినోత్సవం ఈసారి సామాన్య వేడుకలలా కాకుండా, సమాజ సేవా ఘట్టంగా మారింది. విశాఖ నగరమంతా ఒక ఉత్సవ ప్రాంగణంలా మారింది. అభిమానం, కృతజ్ఞత, మానవీయత ఈ మూడూ కలసి అచ్యుతరావు జన్మదిన వేడుకలను ఒక చారిత్రక ఘట్టంగా నిలిపాయి.
ఆరిలోవ నుంచి హైదరాబాద్ వరకు… సేవా జ్యోతి
ఆరిలోవలోని “అమ్మ నాన్న ట్రస్ట్” కు కంచర్ల యువ సేన సభ్యులు వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయగా, “అన్నమ్మ చారిటబుల్ ట్రస్ట్” ఆపరేషన్ కాలనీలో అనాధ పిల్లలకు ఆహార సేవలు అందించాయి. అభాగ్యులకు అండగా నిలవాలనే సంకల్పమే ప్రతి కార్యక్రమానికి ప్రాణంగా మారింది. స్టైలిష్ యూత్ – దుర్గా నగర్, జనసేన యూత్ – ఆరిలోవ, అమ్మ సౌండ్స్ చిన్న – ప్రగతినగర్ యూత్ సమన్వయంలో భారీ కేక్ కటింగ్ వేడుకలు అభిమానుల సమక్షంలో సాగాయి. ప్రతి సంఘం అచ్యుతరావు సేవల పట్ల అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తీకరించింది.
హైదరాబాద్ ఎస్ఎస్ఎల్ఎస్ ఆఫీసులో విశేష ఘట్టం
హైదరాబాద్‌లోని ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ఫిలిం ఆఫీస్ లో ప్రముఖుల సమక్షంలో కేక్ కట్ చేసిన అచ్యుతరావు ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. 8 మంది వృద్ధ జర్నలిస్టులకు నెలకు రూ.4,000 చొప్పున, 20 మందికి రూ.2,000 చొప్పున పింఛను అందజేయనున్నట్లు ప్రకటించారు. విలేఖరుల బతుకుల్లో వెలుగు నింపే ఈ సంకల్పానికి బాహాటంగా మెచ్చుకోలు వెల్లువెత్తాయి.
ఆశ్రమాలకు పండ్ల పంపిణీ – కళాకారుల కృతజ్ఞత
పెద్ద వాల్తేర్ ఆదర్శ్‌నగర్ గ్రామ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ వేడుకలో అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. డా. అచ్యుతరావు సేవా మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వివిధ ఆశ్రమాలలో ఆయన పేరుమీద పండ్లు పంపిణీ చేశారు. సేవలే పుట్టినరోజు అంటే ఇదే అనిపించేలా ఏర్పాట్లు జరిగాయి.
ఆరిలోవలో ప్రతి వాడలోనూ సేవల మాధుర్యం
ఆరిలోవ పరిధిలోని ప్రతి వాడలోనూ అభిమానులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టి, అచ్యుతరావు జన్మదినాన్ని ఓ ఉత్సవంగా మార్చారు. ఆయన సేవా ప్రస్థానానికి అంకితభావంతో అనేక మంది యువత ముందుకు వచ్చారు.
“మన జీవితాల్ని గౌరవించినవారికి ఇది ఒక చిన్న గుర్తు” – అచ్యుతరావు
“సాధారణంగా జన్మదినం అంటే తనకు అభినందనలు అందుకోవడమే కాదు మానవత్వానికి అంకితంగా జీవించాలన్న సంకల్పాన్ని పునఃస్థాపించుకునే రోజు” అని అచ్యుతరావు. ఈ సందర్భంగా అన్నారు. “వృద్ధ విలేఖరులు ఎన్నో పోరాటాలు చేసి బతికారు. వారి జీవితాల్లోకి వెలుగు రావాలి” అని అన్నారు.