విప్లవజ్యోతి, మన్యంవీరుడు, అగ్గి పిడుగు, తెలుగుజాతి ఖ్యాతిగా పేరుపొందిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, తేతలిలో, ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 27 సంవత్సరములు జీవించిన అల్లూరి సీతారామరాజు నుండి మనమందరం దేశభక్తి, ధైర్యం, త్యాగనిరతి అలవర్చుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జె. రాజకుమారి, జి సుధారాణి, పి. గంగభవాని, బి. ఎం. గోపాలరెడ్డి, ఎస్. రామకృష్ణ, పి.డి. వెంకటేశ్వరరావు, పి. మాధవి లక్ష్మి, జె. బుచ్చియ్య, ఎం. ఎన్. పుష్పవల్లి, పి. పావని, ఎం. సూర్యచంద్ర కుమారి తదితరులు పాల్గొన్నారు.
