తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఖరీఫ్ సీజన్ కు గాను ఏర్పాటు చేసిన “ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని” రైతులతో కలిసి తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల పేరుతో అన్నదాతలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. గతంలో ధాన్యం అమ్మిన సొమ్మును 6 నెలలు దాటిపోయినా కూడా రైతులు ఖాతాల్లో జమ చేయలేని పరిస్థితి ఉండేదని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారన్నారు. రైతులకు అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాధాకృష్ణ స్పష్టం చేశారు.