తణుకులో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు పట్టణములో పలు వార్డులలో CC రోడ్లు మరియు డ్రైనేజీలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు 15వ ఆర్థిక సంఘం నిధులు అలాగే మున్సిపాలిటీ నుంచి సాధారణ నిధులు నుంచి దాదాపు దాదాపు 7 వర్కులకు సంబంధించి 2 కోట్ల 26 లక్షల రూపాయలతో ఈరోజు పలు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ఈ నిధులతో సిసి రోడ్లు గాని, ముఖ్యమైన డ్రైన్లు గాని, అలాగే రీడింగ్ రూమ్స్ కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్స్ అలాగే మన తణుకుకు సంబంధించి ఎంట్రన్స్ గేటు మార్చి వద్ద గ్లినరీ డెవలప్మెంట్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని చాలా నిర్లక్ష్యం చేశారని అన్నారు. వైయస్సార్సీపి మొత్తంలో ఎక్కడ అభివృద్ధి చేయకుండా కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం పరిపాలన సాగించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అన్నిరంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో తణుకు పట్టణాన్ని పలుఅభివృద్ధి ప్రణాళికలు ఏర్పరచుకొని తణుకు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణముగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link