విశాఖపట్నం: ఆగస్టు 7 (కోస్టల్ న్యూస్)
జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ నాయకత్వంలోని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనియన్లకతీతంగా పత్రికా సంపాదకులకు ఘన సత్కారం చేశారు. అందులో భాగంగా గ్రేటర్ టుడే జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ డా.నేమాల హేమసుందరరావును జాప్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కేఎం కీర్తన, జేవీకే అప్పలరాజు ఇతర కార్యవర్గ ప్రతినిధులు ముఖ్య అతిథులచే దుశ్శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు.డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీసరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల చైర్మన్ కే.సంజీవ్,
జాప్ జిల్లా శాఖ ప్రతినిధులు పీఏఆర్ పాత్రుడు, గంటా చంద్రశేఖర్, వడ్డాది ఉదయ్ కుమార్, గొట్టివాడ దానేష్,
కె పృధ్వీరాజ్, సాయి, రాపర్తి శ్రీనివాసరావు, ఎస్ ఎన్ నాయుడు, వెంకట్, సురేష్, ఉద్యమం పత్రిక సంపాదకుడు గొండు అచ్యుతరావు
సీనియర్ జర్నలిస్ట్ ఆడారి కొండలరావు పలువురు పత్రికా సంపాదకులు పాత్రికేయులు పాల్గొన్నారు.