చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వకళాశాల 1992-95 విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల (స్వ. ప్ర.),తణుకు నందు 1992-95 సంవత్సరాలలో బి. ఎస్సీ నందు ఎంపీసీ ,ఎంపీఈ , సి బి జెడ్ గ్రూపులలో చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ఇన్-చార్జి ప్రిన్సిపాల్ శ్రీ ఆర్ కె ఫణిధర్ అధ్యక్షత వహించి, కళాశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ డా. పి అనిల్ కుమార్ చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అలాగే కళాశాలలో వసతుల కల్పనకై తమవంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్ధులు తెలిపారు. ఈ సమావేశంలో నాడు అధ్యాపకులు గా పని చేసి, పదవీ విరమణ పొందిన డా. ఏ. గాంధీ (జువాలజీ ) డా. కె. హరిశ్చంద్ర ప్రసాద్ ( కెమిస్ట్రీ), శ్రీ యమ్. వీరభద్రరావు,( ఫిజిక్స్), శ్రీ వి జి కె రెడ్డి ( జువాలజీ) అధ్యాపకులను మరియు ప్రస్తుతం కళాశాలలో పని చేస్తున్న శ్రీ ఆర్.ఎస్.ఎం. భూపాల్ ( మ్యాథమెటిక్స్ ) ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ డీ.వీ.వీ. నాగరాజు, శ్రీమతి వేమూరి రాజరాజేశ్వరి లతో పాటు సుమారు నలభై మంది పూర్వ విద్యార్ధులు హాజరయ్యారు.

Scroll to Top