మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ సంధర్బంగా ఆయన జనవాణిలో వివిధజిల్లాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి బాధితుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క అర్జీని నిశితంగా పరిశీలించి అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు తెలిపి ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమని అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్.