ప్రజలు చట్టాలను తమచేతుల్లోకి తీసుకోవడం చట్టవ్యతిరేకమే

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు విశాఖపట్నంలో లా విద్యార్థినిపై అత్యాచారము, తమిళనాడులో న్యాయవాది దారుణహత్యకు నిరసనగా న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించినారు.
భారత న్యాయవాదుల సంఘం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేయడం దృశ్యాలను వీడియాలో చిత్రీకరించి
బ్లాక్ మెయిల్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని బాద్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. తమిళనాడులో న్యాయవాదిని హత్య చేయడం దారుణమైన విషయమే అన్నారు. ప్రజలు చట్టాలను తమచేతుల్లోకి తీసుకోవడం చట్టవ్యతివ్యరేకతన్నారు. న్యాయవాది వృత్తికి రక్షణకోసం సమగ్రమైన చట్టాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించాలని న్యాయవాదులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరశన కార్యక్రమంలో
డి.పద్మావతి, ఎస్.కె మోతి, కలిదిండి పద్మావతి, ఏ.దుర్గాప్రసాద్, శ్రావణి, ఈ.రామకృష్ణ, అనుకుల రమేష్, జి.అంబేద్కర్, ముప్పిడి సుబ్బయ్య, ఈ అశోక్ కుమార్, ఏ బాలరాజు చింతపల్లి నాగేశ్వరరావు, బి బి విక్టర్ బాబు, కామన మునుస్వామి
బి.రవికుమార్, ఎం.తోని తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top